ట్రీపుల్ సెంచరీ సాధించిన ఆమ్లా
లండన్: ఇంగ్లాండుపై ఆదివారం ట్రిపుల్ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ హషీంఆమ్లా ఆ ఫీట్ సాధించిన 22వక్రీడాకారుడిగా అవతరించాడు.ఐదురోజుల టెస్టుక్రికెట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించిన దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ఆమ్లా మొదటివాడు. ఓవల్‌లో జరుగుతున్న తొలిటెస్టు మ్యాచులో దక్షిణాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. ఆమ్లా పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు. ఆమ్లా ట్రిపుల్ సెంచరీతో ఇప్పటివరకు టెస్టుక్రికెట్ 26ట్రిపుల్‌సెంచరీలు నమోదయ్యాయి. 29ఏళ్ల ఆమ్లా తనకెరీర్‌లో 60వ టెస్టుమ్యాచ్ ఆడుతున్నాడు.దక్షిణాఫ్రికాకు సంబందించి ఏబీ డివిలియర్స్ చేసిన 278పరుగులే వ్య క్తిగత రికార్డు. ఆ రికార్డులను ఆమ్లా బద్దలుకొట్టాడు.ఇంగ్లాండ్ బౌలర్లకు అతను సింహస్వప్నంగా మారా డు. 184వ ఓవర్‌లో టిమ్ బ్రెస్నాన్ బంతిని బౌండరీకి తరలించి ఆమ్లా 300పరుగులు మైలురాయిని దాటాడు.ఇప్పటివరకు నలుగురు బ్యాట్స్‌మెన్ రెండు ట్రిపుల్ సెంచరీలు సాధించారు.డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా), బ్రియాన్ లారా , వీరేంద్ర సెహ్వాగ్ క్రిస్ గెయిల్ టెస్టు క్రికెట్‌లో రెండు ట్రిపుల్ సెంచరీలు నమోదుచేశారు.లారా ఒక్కడుమాత్రమే 400పరుగులు మైలురాయి చేరుకున్నాడు. ఇంగ్లాండుపై జరిగిని మ్యాచులో అతను ఆరికార్డు నమోదుచేశాడు.దేశంపరంగా చూస్తే ఆస్ట్రేలియా ఏడు ట్రిపుల్ సెంచరీలతో పట్టికలో ఆగ్రస్థానంలో నిలుస్తుంది.ఆ తర్వాతి స్థానం ఆరు ట్రిపుల్ సెంచరీలతో వెస్టిండీస్‌ది.
ఇంగ్లాండు ఐదు, పాకిస్థాన్ మూడు, ఇండియా రెండు, శ్రీలంక రెండు, దక్షిణాఫ్రికా రెండు ట్రిపుల్ సెం చరీలు సాధించాయి.