ట్రై సిరీస్ ట్వంటీ-20 అతిథ్య జింబాబ్వే. శుభారంభం
ముక్కోణపు సిరీస్ ట్వంటీ-20 టోర్నమెంట్లో అతిథ్య జింబాబ్వే జట్టు శుభారంభం చేసింది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్లతో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఆదివారం బంగ్లాతో జరిగిన తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 11పరుగుల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది. ఫలితంగా రెండు పాయింట్లను తన ఖాతాలో జింబాబ్వే జమ చేసుకుంది. టాస్ గెలిచి తొలత బ్యాటింగ్ ప్రారంభించిన జింబాబ్వే జట్టులో ఓపెనర్ పోర్ల సహాయంతో 62 పరుగులు సాధించగా, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మాన్‌గా దిగిన కెప్టెన్ బ్రెండన్ టేలర్ 38పరుగులు, మిడిలార్డర్‌లో స్టూవర్ట్ మృతి కెనెయరి 18పరుగులు, చివర్లో గ్రేమీ క్రెమర్ 11 పరుగులు రాబట్టారు. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 5వికేట్ల నష్టానికి 143 పరులు మాత్రమే సాధించింది. ఈ మ్యాచ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచి జింబాబ్వే విజయంలో కీలకపాత్ర పోషించిన హామిల్టన్ మసకెజా ప్లేయర్ ఆఫ్ దీ మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.