ట్రై సిరీస్: శిఖర్ ధావన్ అవుట్(1/1)
బ్రిస్బేన్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో ఇక్కడ జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియాకు ఆదిలోనే చుక్కుదురైంది. ఓపెనర్ శిఖర్ ధావన్(1) పరుగు మాత్రమే పెవిలియన్ కు చేరాడు. కేవలం ఐదు బంతులను ఎదుర్కొన్న శిఖర్ మరోసారి విఫలమయ్యాడు. ఇంగ్లండ్ అటాకింగ్ బౌలర్ అండర్ సన్ బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆకట్టుకోలేకపోయిన శిఖర్.. ట్రై సిరీస్ లో కూడా అదే బాటను అనుసరిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సంగతి తెలిసిందే.