ట్‌బర్గ్ బ్యాడ్మింటన్ ఓపెన్ సెమీస్‌లో సౌరభ్, సమీర్

sourav

సార్‌బ్రూకెన్ (జర్మనీ): భారత బ్యాడ్మింటన్‌లో వర్మ బ్రదర్స్‌గా ఖ్యాతికెక్కిన సౌరభ్ వర్మ, సమీర్ వర్మ బిట్‌బర్గ్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్లో జోరుమీదున్నారు. సహచర షట్లర్లంతా ఆరంభంలోనే వెనుదిరుగగా, ఈ బ్రదర్స్ మాత్రం తమదైన ప్రదర్శనతో అదరగొడుతూ పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు దూసుకెళ్లారు. ఈ సోదరులు సెమీస్‌లో తమ ప్రత్యర్థులను ఓడిస్తే టైటిల్‌కోసం ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నారు. ఇటీవలే చైనీస్ తైపీ ఓపెన్ నెగ్గిన సౌరభ్ వర్మ హోరాహోరీ క్వార్టర్స్ సమరంలో 21-15, 16-21, 21-15తో జర్మనీకి చెందిన మూడోసీడ్ మార్క్ జ్వీబ్లెర్‌కు షాకిచ్చాడు. అంతకుముందు ప్రీక్వార్టర్స్‌లో ఆరోసీడ్ మౌలానా ముస్తఫా (ఇండోనేసియా)ను చిత్తుచేశాడు. మరో క్వార్టర్స్ పోరులో 12వ సీడ్ సమీర్ వర్మ 21-14, 21-16తో ఉక్రెయిన్‌కు చెందిన ఆర్టమ్ పొచ్తారోవ్‌పై గెలిచాడు. అంతకుముందు మ్యాచ్‌లో స్కాట్లాండ్ షట్లర్ కీరన్ మెరిలీస్‌ను ఓడించి సమీర్ కార్వర్టర్స్ చేరాడు. ఫైనల్ బెర్త్ కోసం చైనాకు చెందిన 4వ సీడ్ హి యుకితో సమీర్, 15వ సీడ్ ఆండ్రెస్ ఆంటోసెన్‌తో సౌరభ్ తలపడనున్నారు.

4