డబల్ఇండ్లకు దరఖాస్తుల వెల్లువ..!

భైంసా రూరల్ డిసెంబర్ 07 జనం సాక్షి

– స్థలంఇచ్చిన ప్రతిఒక్కరికి డబుల్ బెడ్రూమ్అందేనా..?

– అయోమయంలో ఇంద్రమ్మ ఇండ్లస్థలలను ఇచ్చిన ప్రజలు…

– ఎంపికవిధానం తెలియక ఇబ్బందిపడుతున్న పలువురు.

 

బైంసా పట్టణంలోని 26 వార్డులలో డబల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుండి ప్రారంభ0 కాగా బుధవారం వరకు కొనసాగనుంది. దరఖాస్తులు మొదలై రెండురోజు కాగా,ఇంకోరోజు మిగిలి ఉండగానే మంగళవారం వరకి 5425 అప్లికేషన్లు వచ్చాయి. బుధవారం ఇదే సగటునా అప్లికేషన్లు వస్తే మరో 2000 పైనే దరఖాస్తులువస్తాయి. మొత్తం దాదాపు 640 డబల్ బెడ్రూమ్స్ ని నిర్మించగా దరఖాస్తులు మాత్రం వేలల్లో వస్తున్నాయి. ఎంపిక విధానంపై ఇంకా సరైన స్పష్టత లేకప్రజలు సందేహాలనువ్యక్తం చేస్తున్నారు.లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరగకుండవుండాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.ఇప్పుడు డబల్ బెడ్రూమ్స్ కి అప్లై చేసి, డబల్ బెడ్రూమ్ రాకపోయిన స్థలంవున్నా వారికీ ఇంటినిర్మాణం నిమిత్తం అందించే మూడులక్షల రూపాయల కొత్తప్రభుత్వ స్కీమ్ కి అర్హులుగా ఉంటామా..!లేదా..! అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

 

ఇంద్రమ్మ ఇండ్లస్థలాలు ఇచ్చిన వారి పరిస్థితి ఏంటి..?

గతంలోకాంగ్రెస్ పార్టీ అధికారంలోఉన్నప్పుడు పేదప్రజలకి ఇందిరమ్మఇండ్ల పేరిటఇండ్లస్థలాలను మంజూరుచేసింది.నిర్మాణాల కొరకుప్రత్యేక అకౌంట్లలలో విడుతలవారీగా నగదుకూడా జమచేసింది.అయితే పట్టణానికిచెందిన బోర్రగణేష్ సమీపంలోఇందిరమ్మఇండ్లకి అప్పటికాంగ్రెస్ ప్రభుత్వంస్థలాన్నిమంజూరు చేయగా, దాదాపు వందకుపైగామంది ఇందిరమ్మఇండ్ల స్థలాలలో బేస్మెంట్ వరికునిర్మాణాలునిర్మించి,మళ్లీ నిధులు రాకపోవడంతో అలానేవేచి ఉంచారు. కాలక్రమేణ ప్రభుత్వాల మారుతూవుండడంతో ఇంద్రమ్మఇంటి నిర్మాణాలుకాస్త అలానే కు0టుపడిపోయాయి. ఇటీవల రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు పట్టణ సరిహద్దులలో ప్రభుత్వ స్థలాలను వెతకగా ఎక్కడ అనువైనస్థలందొరకలేదు. దీంతోగతంలో బైంసాపట్టణం బోర్రగణపతి సమీపాన ఇంద్రమ్మఇండ్లకు కేటాయించిన స్థలాలలోనే నిర్మాణాలు చేపట్టలనినిర్ణయించారు.వారుకట్టుకున్న బేస్మెంట్ లెవెల్,గోడలలెవల్ ఇండ్లనుచెరిపేసే పరిస్థితివచ్చింది.ఇంద్రమ్మఇండ్ల స్థలాల లబ్ధిదారులు,ఇంద్రమ్మ స్థలాలలో ఇంటినిర్మాణం కోసం బేస్మెంట్,గోడల వరకి నిర్మాణాలుచేపట్టిన ప్రజలు, ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ నిర్మించనివ్వబోమంటూ తొలుతఆందోళన చేపట్టారు.వెంటనే స్థానిక ఎమ్మెల్యే,అదికారులు కలిగించుకొని డబల్ బెడ్రూమ్స్ కి అనువైనస్థలంఇదేనని ఇందిరమ్మ ఇండ్లస్థలాల్లో ఇళ్ల నిర్మాణంచేపట్టనివ్వండ0టూ స్థల ప్రజలనికోరారు.ఇక్కడ ఇండ్ల స్థలాలు ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడే డబల్ బెడ్రూమ్స్ అందేలా కృషి చేస్తామని తెలిపారు.రానున్న రోజుల్లో ఎట్లాగో డబల్ బెడ్రూమ్ వస్తుందని ఇందిరమ్మ ఇండ్లస్థలప్రజలు అంగీకారం తెలిపారు. ఎమ్మెల్యే వెంటనే అధికార సిబ్బందికి చెప్పగా…ఇంద్రమ్మ ఇళ్లస్థలాలు ఉన్నవారి వివరాలను,వారి వారి స్థలాలలోని నిర్మాణాల ముందు లబ్ధిదారులుదిగిన ఫోటోలతో సహా అధికారులు నమోదుచేసుకున్నారు.

అయోమయంలో స్థలాలు ఇచ్చిన వారి పరిస్థితి

ప్రస్తుతం డబల్ బెడ్రూమ్స్ కొరకు దరఖాస్తులనగానే నిర్మాణాలనిమిత్తం ఇంద్రమ్మ స్థలాలుఇచ్చిన ప్రజలు అయోమయంలోపడ్డారు.డబల్ బెడ్రూమ్స్ మొదట అనుకున్నట్లుగానే స్థలాలు ఇచ్చిన ప్రతిఒక్కరికి హామి ఇచ్చినప్రకారం డబల్ బెడ్రూమ్ వస్తాయా..!లేక రావా..! అంటూ గతంలో తప్పకుండాఇస్తామని హామీ ఇచ్చినా ఇంకా అప్లై చేసుకోవడం ఉంటుందా..! అంటూ అయోమయంలో ఉన్నారు.చేపట్టిన డబుల్ బెడ్రూమ్ నిర్మాణాల్లో మొదట ఇంద్రమ్మస్థలాలు ఇచ్చిన ప్రజలకే ప్రాధాన్యంఇవ్వాలని ప్రజలుకోరుకుంటున్నారు.

తాజావార్తలు