డబుల్ ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలి
-కలెక్టర్ డి కృష్ణభాస్కర్
రాజన్నసిరిసిల్ల,అక్టోబర్ 28(జనంసాక్షి): సిరిసిల్ల నియోజకవర్గంలోని డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలని జిల్లా కలెక్టర్ డి కృష్ణభాస్కర్ ఆదికారులను ఆదేశించారు. సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట,వీర్నపల్లి ప్రజాప్రతినిధులు అధికారులతో ప్రతి గ్రామంలో ప్రగతి ప్రాం గణాలనిర్మాణాలు, డబుల్ బెడ్‌రూం ఇల్ల నిర్మాణంప్రగతిపై దళిత 3 ఎకరాల
భూపంపిణీ పథకంప్రగతిపై కలెక్టర్ సవిూక్షించారు. ఈసంద ర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ సిరిసిల్ల నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో డబుల్ ఇల్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు, ప్రజాప్రతి నిధులు అధికారులు సమన్వయంతో పనులు వేగంగాజరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు మూడుఎకరాల భూపంపిణీ పథకం కింద దశలవారిగా అర్హులందరికి ప్రయోజనంకలిగేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకకార్యాచరణతో ముందుకుసాగాలన్నారు.నియో జకవర్గంలోని ప్రతి గ్రామంలో 20-25 లక్షల వ్యయంతో కమ్మూనిటీ అవసరాలు తీర్చే ఉద్దేశ్యంతో ప్రగతి ప్రాంగణాలు 5నుంచి 10 గుంట లలో నిర్మించనున్నందున ప్రతిగ్రామంలో ప్రజాప్రతినిధులు అధికారులు స్థలాలు సూకరించి జాయింట్ కలెక్టర్‌కు అప్పగించాలన్నరు, సిరి సిల్ల నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను చివరి గడపకు అందేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ షేక్ యాస్మిన్ భౄషా, ఐటిశౄఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్, ఆర్డీఓ పాండురంగ తదితరులు పాల్గొన్నారు.