డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే తెలంగాణ అభివృద్ధి

` అవినీతి కేసీఆర్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
` మేకిన్‌ ఇండియా పై కేసీఆర్‌, కాంగ్రెస్‌ లకు శ్రద్ధ లేదు.
` మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా అమలవుతుంది
` తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి చేస్తాం
` పదేళ్ల తెలంగాణ పాలన మొత్తం అవినీతిమయం
` కెసిఆర్‌ కుటుంబ పాలనతో నెరవేరని ఆకాంక్షలు
` ఓటమి భయంతో కెసిఆర్‌ రెండుచోట్లా పోటీ
` హుజురాబాద్‌, దుబ్బాకలు ట్రైలర్లు మాత్రమే
` బిజెపితోనే సౌభాగ్య తెలంగాణ సాధ్యం
` నిర్మల్‌ బ్యూరో,తూప్రాన్‌  సభల్లో ప్రధాని మోదీ
నిర్మల్‌ బ్యూరో,తూప్రాన్‌(జనంసాక్షి): కేసీఆర్‌ అవినీతి, కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకున్నదని,డబుల్‌ ఇంజన్‌ సర్కారు తోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు, ఆదివారం నిర్మల్‌ లో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని,కానీ కేసీఆర్‌ సహకరించడం లేదని అన్నారు. రైతులకు ఫజల్‌ భీమా, పేద ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌, ప్రజలందరికీ ఒక్కక్కరికి ఐదు కేజీ ల బియ్యం ఉచితంగా అందజేస్తుందని తెలిపారు, కేసీఆర్‌ కు దోచుకోవడం తప్పా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పై చిత్త శుద్ధి లేదన్నారు, ఎప్పుడూ తన తనయుణ్ణి ముఖ్యమంత్రి గా చేయాలనే ధ్యాస తప్ప పేద ప్రజల గురించి ఆలోచించిన దాఖలు లేవన్నారు. భారతీయ జనతా పార్టీ సబ్బండ కులాల అభివృద్ధి కి పాటుపడుతుందని,కాంగ్రెస్‌, బిఅరెస్‌ పార్టీలు ఇప్పటి వరకు బిసి,ఎస్సి,ఎస్టీల కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని, బీజేపీ మాత్రమే బిసి ముఖ్యమంత్రి ని చేస్తామని అన్నారు, ఎస్సి వర్గి కరణ కొరకు గత కొన్నేళ్లుగా ఎస్సి సోదరులు ఉద్యమం చేస్తున్నారని వారి న్యాయమైన డిమాండ్‌ సాధనకోసం ప్రత్యేక కమిటీ వేసి వారికి న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు.   కోవిడ్‌ సమయంలో ప్రపంచానికి వ్యాక్సిన్‌ పంపిణీ చేసిన ఘనత భారత్‌ కె దక్కిందన్నారు,అవినీతి, కుటుంబ పాలనలో రెండు ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ సర్కారు రాగానే కేసీఆర్‌ అక్రమంగా సంపాదించిన ప్రజల సొమ్ముని వడ్డీతో సహా కక్కిస్తామని అన్నారు, కాంగ్రెస్‌, బిఅరెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు, బీజేపీ అభ్యర్థి లను భారీ మెజారిటీతో గెలిపించాలని సభకు హాజరైన ప్రజలకు అభివాదం చేస్తూ కోరారు,,అనంతరం ప్రధాని నరేంద్రమోడీ ని శాలువా, మెమోంటో లు అందజేశారు..ఈకార్యక్రమంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, నిర్మల్‌,ఖానాపూర్‌, ముధోల్‌, అసెంబ్లీ అభ్యర్థులు మాహేశ్వరెడ్డి, రామారావు పటేల్‌,రాథోడ్‌ రమేష్‌, అంజుకుమార్‌ రెడ్డి ,అయ్యాన్నగారి భూమయ్య, రావుల రాంనాథ్‌,,తదితరులు పాల్గొన్నారునిర్మల్లో బిజెపి నిర్వహించిన సకల జనుల సభ మోదీ మోదీ అంటూ యువకులు కేరింతలు పెట్టడంతో మోడీ ఉత్సాహంగా తెలుగులో ప్రసంగం ప్రారమబించారు,తెలంగాణ కుటుంబ సభ్యులందరికి నమష్కారాలు అని  అనడంతో సభకు హాజరైన జనం కేరింతలు చప్పట్లతో సభ మొత్తం హర్షధ్వానాలు వెలిబుచ్చారు. సభకు వేల సంఖ్యలో యువకులు హాజరికావడంతో గ్రౌండ్‌ మొత్తం కాషాయ మయం అయ్యింది,
తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి చేస్తాం
తూప్రాన్‌: స్కీముల పేరుతో స్కాములు చేసిన కేసీఆర్‌ నో ఫామ్‌ హౌస్‌ కి పరిమితమైన కేసీఆర్ను శాశ్వతంగా ఫామ్‌ హౌస్‌ కు  చేయాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు శాసనసభ ఎన్నికల సందర్భంగా తూప్రాన్‌ లో జరిగిన బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్‌ బి ఆర్‌ఎస్‌ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు అబద్దాల హావిూలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కెసిఆర్‌ ఫామ్‌ హౌస్‌ నుండి పరిపాలన చేస్తూ ఒక్కసారి సెక్రటరీకి రాణి ముఖ్యమంత్రిని పామూరు శాశ్వతం చేయాలని కోరారు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని దళిత బంధు డబుల్‌ బెడ్‌ రూమ్‌ బీసీ బందు ఉద్యోగాలు ఇస్తానని అనేక పథకాలు ప్రకటించి ప్రజలను మోసం చేసిన సీఎంను తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీలతో ఓడిరచాలని కోరారు కాంగ్రెస్‌ బిఆర్‌ఎస్‌ రెండు ఒకటేనని టిఆర్‌ఎస్‌ కు రోగం వస్తే యుగాన్ని పోగొట్టుకోవడానికి కాంగ్రెస్‌ రూపం తెచ్చుకోవద్దని బిజెపితోనే సామాజిక న్యాయం సాధ్యమని అన్నారు రెండు పార్టీలతో తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బిజెపి మాత్రమే తెలంగాణ ప్రతిష్టను పెంచుతుందని అవినీతిని మంటగలుగుతుందని అన్నారు దేశంలో కాంగ్రెస్‌ పార్టీ సుల్తాన్‌ వంశాన్ని పెంచిపోసిస్తే తెలంగాణలో కేసీఆర్‌ నిజాం వారసులను పెంచి పోషిస్తుందని ఎమ్మెల్యేలు 30 శాతం కమిషన్‌ తీసుకుంటున్నారని అవినీతి  ప్రభుత్వాన్ని అంతం చేయాలని కోరారు మాదిగ సమాజానికి గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న న్యాయం జరగలేదని మాదిగలకు జరిగిన అన్యాయాన్ని అంతం చేయడానికి బిజెపి కమిటీ తోని న్యాయం చేస్తుందని అన్నారు తెలంగాణలో బిసి వ్యక్తి ముఖ్యమంత్రి అవుతాడని మోడీ గ్యారెంటీ ఇచ్చాడని మోడీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా అమలు చేస్తుందని అన్నారు గత 50 సంవత్సరాలుగా బీసీలకు అన్యాయం జరుగుతుందని మంత్రివర్గంలో వారికి సమచిత స్థానం కల్పిస్తామని అన్నారు ఈ ఖరీఫ్‌ సీజన్లో తెలంగాణలో 20 లక్షల మెట్టు టన్నుల బయలుదేసును తీసుకుంటామని తెలంగాణలో మిల్క్‌ ప్రాసెసింగ్‌ ఏర్పాటుకు చేస్తామని అన్నారు గజ్వేల్‌ నియోజకవర్గ పరితలపైన కేసీఆర్‌ నమ్మకం లేకనే మరో చోట నుండి పోటీ చేస్తున్నాడని ఓడిపోతున్నామని భయం వారిలో ఉందని అన్నారు స్కీంలో పేరుతో స్కాములు చేసి వారు తప్పించుకోలేరని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్‌ అభ్యర్థి ఈటల రాజేందర్‌ నర్సాపూర్‌ అభ్యర్థి మురళీధర్‌ యాదవ్‌ పటాన్చెరు అభ్యర్థి నందీశ్వర్‌ గౌడ్‌ దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌ రావు సంగారెడ్డి అభ్యర్థి పులిమామిడి రాజు సిద్దిపేట అభ్యర్థి దూది శ్రీకాంత్‌ మెదక్‌ అభ్యర్థి విజయకుమార్‌ మల్లారెడ్డి గిరీష్‌ రెడ్డి ప్రేమేందర్‌ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు మల్లారెడ్డి మెదక్‌ పార్లమెంట్‌ ఇన్చార్జి వర్గంటి రామ్మోహన్‌ గౌడ్‌ రాష్ట్ర సర్పంచుల ఫోరం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నెత్తి మల్లేష్‌ చంద్రశేఖర్‌ పోచయ్య ఐలయ్య జానకిరామ్‌ లంజా గౌడ్‌ శివమ్మ యాదవ సాయి బాబా మహేష్‌ గౌడ్‌ వివిధ మండలాలను పార్టీ అధ్యక్షులు నాయకులు బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు

తాజావార్తలు