డబుల్ బెడ్ రూముల బిల్లులు స్వాహా ?
10 నెలల క్రితం బిల్లులు పూర్తి : * బిల్లులు మొత్తం డ్రా చేసిన పంచాయతీరాజ్ ఏఈ నరేష్ : * పనులు పూర్తి కాకుండానే బిల్లులు విడుదలైన వైనం ! భూపాలపల్లి ప్రతినిధి జూన్ 28 (జనం సాక్షి) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని గణపురం మండలంలోని మైలారం గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో 45 డబుల్ బెడ్ రూములు మంజూరు కాగా అవి ఇప్పటి వరకు పూర్తి కావాల్సి ఉంది పోయి నత్తనడకన పనులు సాగి ఆగాయి. గత సంవత్సరం సెప్టెంబర్ 17 వ తేదీన డబల్ బెడ్ రూమ్ లు మొత్తం ఇండ్లు పూర్తి అయినట్లుగా సంబంధిత పంచాయతీ రాజ్ గణపురం ఏ ఈ నరేష్ ఎం బి రికార్డులు చేసి బిల్లు మొత్తం డ్రా చేసినట్లు గా సంబంధిత లబ్ధిదారులు అయినా బూర దీప మంగళవారం ఘనపురం మండల కేంద్రంలో జనం సాక్షి ప్రతినిధి తో మాట్లాడుతూ ఇప్పటివరకు కూడా పూర్తి కానీ డబుల్ బెడ్ రూమ్ లకు పూర్తయినట్లు గా ఒక్కో డబుల్ బెడ్ రూమ్ కు 505000 రూపాయల చొప్పున మొత్తం 45 డబుల్ బెడ్ రూమ్ లకు గాను 2 కోట్ల 27 లక్షల 65 వేల రూపాయల బిల్లులు విడుదల అయినట్లు ఆమె తెలిపారు. దాదాపు బిల్లులు విడుదలై 10 నెలలు కావస్తున్నా సంబంధిత పి ఆర్ ఏ ఈ నరేష్ ఇప్పటి వరకు కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవని ఆమె అన్నారు డబుల్ బెడ్ రూమ్ లో పనులు దాదాపు 60 శాతం పూర్తయినాయి కానీ కిచెన్ రూమ్ లో సెల్పులు, బాత్రూమ్స్, లెట్రిన్ లా నిర్మాణాలు చేపట్టలేదని , టైల్స్ ,కలర్స్ వేయకుండా వదిలి వేశారని ఆమె అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సంబంధిత ఏఈ పై చర్యలు తీసుకొని ఇప్పటికైనా ఆగిన డబుల్ బెడ్ రూమ్ లను తక్షణమే నిర్మాణాలు చేపట్టాలని హౌసింగ్ అధికారులను, పంచాయతీ రాజ్ ఈ ఈలను, సంబంధిత జిల్లా కలెక్టర్ లకు ఆమె విజ్ఞప్తి చేశారు.