*డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ధర్నా…

కరీంనగర్ టౌన్ సెప్టెంబర్ 22(జనం సాక్షి)

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను అర్హులైన పేదలకు పంపిణీ చేయకపోతే ప్రజలతో ఆక్రమిస్తామని కలెక్టరేట్ ముందు జరిగిన ధర్నాలో ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మిల్కూరు వాసుదేవ రెడ్డి. సిఐటియు జిల్లా అధ్యక్షుడు యు శ్రీనివాస్. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వడ్ల రాజు. ధర్నా లో మాట్లాడారు. ధర్నా ముందు ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో చిట్యాల ఐలమ్మ విగ్రహం నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ అనంతరం ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రతి ఇల్లు లేని కుటుంబానికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కట్టి ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిందని విమర్శించారు జిల్లాలో నిర్మించిన ఇండ్లకు విద్యుత్ కనెక్షన్, రోడ్లు, నీటి సౌకర్యం కల్పించి తక్షణమే ఇండ్లు లేని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. లేనియెడల లబ్ధిదారులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అక్రమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణం కోసం వెచ్చించి నేడు ప్రభుత్వం నిరుపేగంగా ఉంచిందని అన్నారు. తక్షణమే పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. 125 గజాల ఇండ్ల స్థలం ఉన్న కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణ ఖర్చులకు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి మరిచిపోయిందని ఎద్దేవ చేశారు. అర్హులైన పెన్షన్ దారులకు దరఖాస్తులు స్వీకరించి ప్రభుత్వం పెండింగ్లో ఉంచిందని వారికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలాలలో ఇండ్లు లేని పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు ఇంటి పట్టాలు ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయం జిల్లా పరిపాలన అధికారి నారాయణ గారికి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గిట్ల ముకుంద రెడ్డి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం. రైతు సంఘం శీలం అశోక్ .సుంకరి సంపత్. కొప్పుల శంకర్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పార సురేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రజినీకాంత్ ఐద్వా జిల్లా కార్యదర్శి నాగరాణి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి తిరుపతి నాయకులు డి నరేష్.రాయ్ కంటి శ్రీనివాస్. గజ్జల శ్రీకాంత్ కొంపెల్లి సాగర్ కవ్వంపల్లి అజయ్. గాజుల కనక రాజు.కె ప్రభాకర్. కనుకయ్య.కె రాజు . రాజ్ కుమార్ నవీన్ రఘు రాకేష్ యుగంధర్,J. అంజయ్య.
దవ్య అన్నపూర్ణ, మాదసు యమునా. వినోద్ సురేష్.వినయ్, సంతోష్, శివ, అరవింద్, రోహిత్, సురేష్, కార్తిక్, వరుణ్, సిద్దు, అఖిలేష్, మహేష్, సాత్విక్,