డాక్టర్ అడువాలా సుజాతకు పురస్కారం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 14. (జనం సాక్షి) సాహిత్య సామాజిక సేవ రంగంలో విశేష సేవలందించిన డాక్టర్ అడువాల సుజాతను మరో పురస్కారం వరించింది. గోని వెంకటేశ్వర్ సేవా సంస్థ వివిధ రంగాల్లో విశేషంగా సేవలను అందించిన వారిని గుర్తించి ప్రతిభ పురస్కారాలు అందజేస్తుంది. సాహిత్య సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన డాక్టర్ అడువాల సుజాతను సాహిత్య సామాజిక సేవ విభాగంలో పురస్కారాన్ని హైదరాబాద్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో శుక్రవారం పురస్కారాన్ని అందజేశారు. గాంధీ హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ గుర్రం నరసింహారావు చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నట్లు అడవాల సుజాత తెలిపారు. డాక్టర్ అడువాల సుజాత పురస్కారం అందుకోవడం పట్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు కవులు సాహితీవేత్తలు హర్షం చేశారు.