డాక్టర్ శేఖర్ రెడ్డి కి 11వసారి గోల్డ్ మెడల్.. ప్రశంసా పత్రం

 

 

ప్రముఖ వైద్యుల ప్రశంసలు మన్నెనలు పొందిన శేఖర్ రెడ్డి

మిర్యాలగూడ, జనం సాక్షి

కరీంనగర్ జిల్లా కేంద్రం శివారు లోగల నుగునూరులో ప్రతిమ మెడికల్ కళాశాలలో ఈనెల 16 17 18 తేదీలలో చెవిటి, ముక్కు, గొంతు,( ఈఎన్ టి) అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ఏడవ సదస్సు ఘనంగా ముగిసింది. జాతీయ, రాష్ట్ర ప్రముఖ ఈఎన్టి వైద్యులు వారి అనుభవాలను వైద్య పరీక్షలపై వివరించడం జరిగింది, ఈ సదస్సులో 600 మంది ఈఎన్టి వైద్యులు పాల్గొన్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. సదస్సులో జైపూర్, మలేషియా నుంచి వచ్చిన ఇఎన్టి ప్రముఖ వైద్య నిపుణులు హాజరై వైద్యరంగంలో వచ్చిన నూతన టెక్నాలజీ పై ప్రసంగించడంతోపాటు వివిధ రకాల ఇఎన్టి శస్త్ర చికిత్సలు చేసిన విషయాలను వివరించారు. రాష్ట్ర సదస్సులో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన ప్రముఖ ఈఎన్టి వైద్యుడు డాక్టర్ శేఖర్ రెడ్డి చెవి ఆపరేషన్లపై ఆధునిక పరీక్షల వైద్య విధానం పై ప్రసంగించారు. ఈ సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన చెప్పిన అంశాలను ఎంతోగానో ఆకట్టుకున్నాయి. ప్రశంసలు మన్నెనలు పొందారు. దీంతో డాక్టర్ శేఖర్ రెడ్డి కి గోల్డ్ మెడల్ అందజేసి, ప్రశంసాపత్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సదస్సులో పాల్గొన్న వైద్యులందరూ శేఖర్ రెడ్డికి అభినందన తెలియజేశారు. డాక్టర్ శేఖర్ రెడ్డికి 11వసారి గోల్డ్ మెడల్ లభించడంతో మిర్యాలగూడ చెందిన ఐఎంఏ వైద్యులు పలువురు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.