డిపాజిట్లు ఎవరు కోల్పోతారో ప్రజలు తేలుస్తారు

బిజెపి నేత సుగుణాకర్‌ రావు

కరీంనగర్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎవరు ముందుంటారో, ఎవరు డిపాజిట్లు కోల్పోతారో ప్రజలు నిర్ణయిస్తారని బిజెపి కిసాన్‌మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పి.సుగుణకర్‌రావు అన్నారు. ప్రజలు బిజెపి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. నాలుగేళ్ల టిఆర్‌ఎస్‌ పాలన ప్రజలకు తెలియంది కాదన్నారు. కేవలం ఒక కుటుంబం కోసం రాష్ట్రం ఏర్పడలేదన్నారు. కరీంనగర్‌ భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలపించాలన్నారు. బిజెపి అఢ్యర్థుల గెలుపుకోసం యావత్‌ తెలంగాణ ఎదురుచూస్తోందన్నారు. అందుకు ప్రజలంతా బిజెపికి ఓటేయాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అమరవీరుల కుటుంబాల వద్దకు స్వయంగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఎవరి కథలు కంచికి చేరేది డిసెంబరు 11న తేలిపోతుందని చెప్పారు. తమను విమర్శించే వారు వారిపై వస్తున్న విమర్శలను ముందుగా గమనించాలన్నారు. గతంలో పరిపాలించిన కాంగ్రెస్‌, తెరాస ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు.