డి ఈ ఓ ను కలసి వినతిపత్రాన్ని అందజేసిన వ్యాయామ ఉపాధ్యాయులు

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం/జనంసాక్షి):- తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బాబయ్య, ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాబేర్  ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు ని మర్యాదపూర్వకంగా కలిసి వ్యాయామ విద్య అభివృద్ధి కోరకు, విద్యార్థుల శ్రేయస్సు కొరకు పాటుపడాలని కొన్ని సూచనలతో కూడిన వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది.వ్యాయామ విద్య అభివృద్ధి కొరకు చేసిన సూచనలు
విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం యోగ కోరకు పాఠశాలల్లో కచ్చితమయినా సమయం కేటాయించవలసిందిగా ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జరిచేయాలనీ కోరడం జరిగింది.
ప్రతి తరగతికి ప్రతిరోజు ఒక గేమ్స్ పీరియడ్ ఉండేలా చూడాలని కోరడం జరిగింది. పాఠశాల లో క్రీడాపరికరాల కొనుగోలు కోసం తక్షణమే తమ పరిధిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకొని జిల్లా లోని అన్ని పాఠశాల లకు కనీస బడ్జెట్ ను కేటాయించాలని వ్యాయామ విద్య ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో ప్రభుత్వం పిఈటి ల భర్తీ చేసేవరకు తాత్కాలిక పద్దతిన పి.ఈ.టి లను భర్తీ చేసి విద్యార్థుల మానసిక, శారీరక అభివృద్ధి కోరకు పాటుపడాలని కోరడం జరిగింది.ఈ సందర్బంగా జిల్లా విద్యాధికారి సుశీందర్ రావు  మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు, వ్యాయామ విద్య అభివృద్ధి కోరకు కచ్చితంగా సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయమ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు బాబయ్య , ప్రధాన కార్యదర్శి మహ్మద్ సాబేర్ , తదితరులు ఉన్నారు..