డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.

ఎల్లారెడ్డి 23 అక్టోబర్   జనం సాక్షి:   ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో ని దేవునిపల్లి లో శనివారం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్ నేరాలపై  అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అందరు కలిసి మెలిసి గొడవలు లేకుండా క్షిణక ఆవేశంతో గొడవలు చేసుకోవద్దు అని సూచించారు   సైబర్ నేరాలపై , మహిళల భద్రత పై అవగహన కలిగి ఉండాలని ఏదైనా ఆపద వస్తే 100 నెంబర్ కి కాల్  చెయ్యాలని   ఏవారైనా గుర్తు తెలియని నెంబర్ నుండి కాల్స్ వచ్చిన లింక్ పంపి మీ అకౌంట్ సమాచారం ఇవ్వదు అని   గ్రామస్తులకు సూచించారు. ఎవరైనా గ్రామం లో కొత్త వారు సంచరిస్తూ పోలీసులకు తెలియ చెయ్యాలని కోరారు  రహదారి భద్రత పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు హెల్మెట్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగ ఉండాలని అన్నారు.చిన్న పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ  తీసుకోవాలని చిన్న పిల్లల  పై అత్యాచారాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా పిల్లలను చూసుకోవాలిని ,తెలిపారు  గ్రామంలో సిసి కెమెరా లు ఏర్పాటు చేసుకోవడం వల్ల నేరాలను అదుపు చేయచ్చు అని గ్రామస్తులకు సూచించారు.   ఈ కార్యక్రమంలో సి ఐ శ్రీనివాస్, ఎల్లారెడ్డి ఎస్ ఐ గణేష్  నాగిరెడ్డి పెట్ లింగం పెట్  ఎస్ ఐ లు. శంకర్  ఆంజనేయులు తో పాటు, కౌన్సిలర్ సాయిలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.