డీజిల్ లేక..!చెత్త సేకరణ నిలిచే..!
భైంసా రూరల్ డిసెంబర్ 04 జనం సాక్షి
నిర్మల్ జిల్లా భైంసా పట్టణ మున్సిపల్ చెత్త సేకరణ ఆటోలు వాడవాడల తిరిగి చెత్త సేకరణ చేయాల్సి ఉండగా, డీజిల్ లేక శనివారం,ఆదివారం స్తబ్దంగా నిలిచిపోయాయి.పట్టణమున్సిపాలిటీ పెట్రోల్ బంక్ లకు దాదాపు 17 లక్షలు డీజిల్ బిల్లులు పెండింగ్ లో ఉంచినందుకె,ఆటోలలో డీజిల్ పొయమని బంక్ నిర్వాహకులు మున్సిపల్ సిబ్బందికి తెలిపినట్టు సమాచారం.ఈ రెండు రోజులు చెత్త సేకరణ లేక ప్రజలు కొధ్దిమేర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. మరో వైపు విద్యుత్ బిల్లు కూడా పెండింగ్ ఉండడంతో, విద్యుత్ అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాలి. పట్టణ ప్రగతిలో భాగంగా సరియైన టైంలో నిధులు విడుదల కాక పోవడంతోనె ఇలాంటి సమస్యలు అని తెలుస్తుంది. ఇదే విషయమయి మున్సిపల్ సిబ్బందికి వివరణ కోరగా… పెట్రోల్ బంకువారికి మునిసిపల్ సిబ్బంది ట్రెజరీ చెక్కులు ఇవ్వడంతో డబ్బులు పంపుకి జమ కావాలంటే సమయం పడుతుందని,దీంతో చెక్కులు కాకుండా డైరెక్ట్ గా అమౌంట్ చెలిస్తే బాగుంటుందని పంపు వారు తెలిపారన్నారు.