డెబిట్‌ కార్డుల చెల్లింపుల్లో ఎస్‌బిఐ అగ్రస్థానం

నగదు రహిత చెల్లింపులకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) డెబిట్‌ కార్డును జనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఎస్‌బిఐ దాని ఐదు అనుబంధ బ్యాంకుల ఖాతాదారుల డెబిట్‌ కార్డు ద్వారా ఈ ఆర్థిక సంవత్సంలో 30 వేల కోట్ల రూపాయలను చెల్లించారు. మొత్తం చెల్లింపుల వాటాలో 25 శాతంలో ఎస్‌బిఐ అగ్రస్థానం దక్కించుకుంది.ఈ ఏడాది మార్చి చివరి నాటికి ఎస్‌బిఐ దేశంలోనే అత్యధికంగా 20.59 కోట్ల డెబిట్‌ కార్డులను జారీ చేసింది. ఎస్‌బిఐ స్నాప్‌ డీల్‌, అమోజాన్‌, మేక్‌ మై ట్రిప్‌ వంటి అనేక రకాలైనల ఈ-కామార్స్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. క్యాష్‌ బ్యాక్‌ వంటి ఆఫర్లను ప్రకటిస్తూ ఖాతాదారులను ఆకర్షిస్తోంది. మొబైల్‌ బ్యాంకింగ్‌ చెల్లింపుల్లోను ఎస్‌బిఐదే ప్రధమస్థానం. ఇందులో ఎస్‌బిఐ ఇతర బ్యాంకులను పక్కకునెట్టి మొత్తం చెల్లింపుల్లో 46 శాతం వాటాను చేజిక్కించుకుంది.