*డ్రం సీడర్ తో వరి విత్తుకోవడం పై అవగాహన సదస్సు*

శ్రీరంగాపురం: ఆగస్ట్ 01 (జనంసాక్షి)
శ్రీరంగాపూర్ మండలంలో ఈ రోజు డ్రం సీటర్ ద్వారా వరి విత్తనాలు నేరుగా విత్తడం జరిగింది.ఈ కార్యక్రమంలో రైతులకు వ్యవసాయ విస్తరణ అధికారి జి.శ్రీనివాసు పలు సూచనలు చేయడం జరిగింది.ఈ డ్రం సీడర్ ద్వారా ఎకరానికి 10 నుంచి 15 కేజీల విత్తనం సరిపోతుంది. ముందుగా 12 గంటలు విత్తనాలు నానబెట్టి 24 గంటలు ఎండగట్టి ముక్కు పగిలిన గింజలను డ్రం సీడర్ పరికరంలో పోసి ప్రధాన పొలంలో దమ్ము చేసిన తర్వాత తిప్పడం వలన వరుసలుగా గింజలు పడతాయి.ఈ గింజలు వరుసలలో పడటం వలన గాలి, వెళ్తురు బాగా తగలడం వలన పైరు పెద్దగైన తర్వాత తెగుళ్లను, పురుగులను తట్టుకోగలుగుతుంది.ఈ డ్రం సిడర్ తో విత్తుకోవడం వలన రైతుకు నారు పెంచే పని ఉండదు. అలాగే నాటు వేసే పని కూడా ఉండదు.కాబట్టి నారు పెంచే ఖర్చును మరియు కూలీల ఖర్చులు దాదాపు ఎకరాకు 8,000/- వరకు పెట్టుబడి తగ్గించుకోవచ్చు.
అలాగే ఈ డ్రం సీడర్ పద్ధతి ద్వారా విత్తుకునే వారిలో వాడవలసిన కలుపుమందులు, ఎరువులు, నీరు మొదలైనటువంటి యాజమాన్య పద్ధతులను తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పొలం రైతులు రామకృష్ణ మరియు కృష్ణయ్య, రాధాకృష్ణ , బాలస్వామి మొదలైన వారు పాల్గొన్నారు.