ఢాకా ప్రీమియర్ లీగ్ మళ్ళీ వాయిదా
ఫిక్సింగ్ ఆరోపణలతో బంగ్లాదేశ్ క్రికెట్ డొమెస్టిక్ షెడ్యూల్ గందరగోళంలో పడింది. దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ ఢాకా ప్రీమియర్ లీగ్‌ను వాయిదా వేస్తున్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రకటించింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు ఇటీవల వెలుగులోకి రావడంతో ఐసిసి అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టోర్నీ నిర్వహించడం సరికాదని , విచారణ పూర్తయ్యే వరకూ వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్టు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది. మూడో సీజన్ వాయిదా పడడం ఇది మూడోసారి. శ్రీలంక పర్యటన కారణంగానూ , ఆటగాళ్ళ సమ్మె కారణంగానూ ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేశారు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ అష్రాఫుల్ బీపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్పడినట్టు ఇటీవలే అంగీకరించాడు. మ్యాచ్‌లు ఉధ్ధేశపూర్వకంగా ఓడిపోయేందుకు బుకీల నుండి డబ్బులు కూడా తీసుకున్నట్టు చెప్పాడు. అయితే వారిచ్చిన చెక్ చెల్లకపోవడంతో ఫిక్సింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం దీనిపై ఐసిసి యాంటీ కరప్షన్ యూనిట్ విచారణ జరుపుతోంది. ఐసిసి విచారణ పూర్తయిన తర్వాత టోర్నీల కొత్త తేదీలు ప్రకటిస్తామని బిసిబి తెలిపింది.