ఢిల్లీలో గస్తీని ముమ్మరం చేస్తాం : షిండే
న్యూఢిల్లీ: దేశరాజధానిలో జరిగిన కీచక పర్వంపై అన్ని వైపులా నిరసనలు వ్యక్తం అవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభలో హోంమంత్రి షిండే మాట్లాడారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. ఢిల్లీలో పోలీసు గస్తీని ముమ్మరం చేస్తామని చెప్పారు. అక్రమంగా బస్సులు తిప్పుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ప్రైవేటు బస్సులు సిబ్బంది, మార్గం వివరాలు తెలిపే బోర్డులను ప్రదర్శించేటట్లు చూడాలని పోలీసులను ఆదేశించినట్లు చెప్పారు. వాహనాల అద్దాలకు నల్లని ఫిల్మ్‌లు, తెరలు తొలగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అయితే షిండే ప్రకటనపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి