ఢిల్లీలో తెలంగాణపై చర్చలు: ఎంపీ రాజయ్య
వరంగల్: ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయని సిరిసిల్ల ఎంపీ రాజయ్య తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రాంత మంత్రులకు ఢిల్లీలో పార్టీ పెద్దల అపాయింట్‌మెంట్ లభించలేదని చెప్పారు. మంత్రి డీకే అరుణ చిత్తశుద్దితో తెలంగాణ ఉద్యమంలో పాల్లొనాలని డిమాండ్ చేశారు. గతంలో డీకే ఆరుణ మంత్రి పదవికి రాజీనామా చేసి విధులకు హాజరైన విషయాన్ని ప్రజలు మరిచిపోరు అని ఆయన గుర్తు చేశారు.