ఢిల్లీ మెట్రో ఉద్యోగుల సమ్మె హెచ్చరిక

ఆందోళనలో ప్రయాణికులు

న్యూఢిల్లీ,జూన్‌28(జ‌నం సాక్షి): ఢిల్లీ మెట్రోకు చెందిన 9 వేల మంది సిబ్బంది శుక్రవారం నుంచి సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు. దీంతో మెట్రో సేవలకు అంతరాయం కలిగే అవకాశముంది. అయితే సమ్మెఉ జరక్కుండా అధికారులు వారితో చర్చిస్తున్నారు. ఏడాదిగా సిబ్బంది పలు డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఇవి నెరవేకపోవడంతో సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించారు. తమ నిరసనలో భాగంగా గత 19వ తేదీ నుంచి నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల యూనియన్‌కు గుర్తింపు నివ్వాలని, వేతనాల విషయంలో ఇచ్చిన హావిూలు నెరవేచ్చాలని కోరుతున్నారు. అలాగే స్టేషన్లలో పనిచేసే ఉద్యోగుల పని గంటల విషయంలోపునరాలోచించాలని కోరుతున్నారు. చిన్నచిన్న తప్పులకే ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం తగదని, అలా తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ‘మెట్రో’ ఉద్యోగుల డిమాండ్‌ చేస్తున్నారు.