ఢిల్లీ సెక్రటేరియట్‌లో విూడియాకు నో ఎంట్రీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ): ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మొదటి రోజున దిల్లీ సెక్రటేరియట్‌లోకి విూడియాను అనుమతించలేదు. దిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న కేజీవ్రాల్‌ సోమవారం మొదటిసారిగా విధులకు హాజరయ్యారు. అయితే ఆప్‌ ప్రభుత్వ మొదటి రోజున సీనియర్‌ అధికారుల ఆదేశాల మేరకు దిల్లీ సెక్రటేరియట్‌లోకి భద్రత సిబ్బంది విూడియాను లోపలికి పంపించలేదు. ఈ ఘటనపై వివరణ ఇచ్చేందుకు సీనియర్‌ అధికారులు అందుబాటులో లేరు. సోమవారం సాయంత్రం దిల్లీ కేబినేట్‌ సమావేశం అనంతరం ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా విూడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇదిలావుంటే ఎన్నికల సందర్భంగా వివిధ అంశాలపై ఇచ్చిన అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా ప్రధాని కామెంట్స్‌పైనా చర్చించారని సమచారం.  ఎన్నికల

వేళల్లో పార్టీలు ఉచిత హావిూలు ఇవ్వడం సరికాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి చేయలేని, కరెంట్‌ కోసం పక్క రాష్టాల్ర విూద ఆధారపడే వారు కరెంట్‌ బిల్లులను తగ్గిస్తామని ఎలా చెప్తారని పరోక్షంగా ఆమ్‌ ఆద్మీ పార్టీపై మోదీ అసహం వ్యక్తం చేశారు. సంప్రదాయేతర ఇంధన వనరుల సమావేశంలో ఆదివారం పాల్గొన్న మోదీ.. రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నికల్లో ఉచిత విద్యుత్‌ను ఇస్తామంటాయని.. అలాంటి వాగ్దానాలు చేయకుండా నాయకులు జాగ్రత్త పడాలని సూచించారు ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ఆప్‌.. ఢిల్లీ వాసుల విద్యుత్‌ బిల్లులను 50 శాతం తగ్గిస్తామని చెప్పడం తెలిసిందే. ఆప్‌ వాగ్దానాలనే మోదీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే.. దేశంలో చాలా మంది రైతుల నీటి వసతి విద్యుత్‌పై ఆధారపడి ఉందని, వారి కష్టాలను మాత్రం సానుభూతితో పరిశీలించాలని ప్రధాని చెప్పారు. తమపై ప్రధాని వేసిన ప్రశ్నాస్త్రాన్ని ఆప్‌ సీరియస్‌గానే తీసుకుంది. సీనియర్‌ ఆప్‌ నేత కుమార్‌ విశ్వాస్‌.. ఎన్నికల్లో బీజేపీ కూడా విద్యుత్‌ బిల్లులను 50 శాతానికి తగ్గిస్తామని వాగ్దానాలు చేసిందని గుర్తుంచుకోవాలని చెప్పారు. విద్యుత్‌ను చౌకగా లభించేలా ప్రభుత్వాల విధానాలు ఉండాలని ఆప్‌ ఢిల్లీ కన్వీనర్‌ అశుతోశ్‌ అన్నారు. దీంతో ఈ సమస్యలపైన ప్రధానంగా కేజ్రీ చర్చించారని సమాచారం.