తండ్రి ఆగడాలు సహించలేక హత్య
కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు
నిజామాబాద్,జూలై23(జనంసాక్షి): ఇందల్వాయి మండలం ఎల్లారెడ్డిపల్లిలో దారుణం జరిగింది. జైలు నుంచి తిరిగి వచ్చిన తండ్రిని కుమారుడు ప్రశాంత్ హత్య చేశాడు. 4 నెలల క్రితం భార్యను హత్య చేసి జైలుకెళ్లిన ప్రశాంత్ తండ్రి.. ఇటీవలె బెయిల్‌పై బయటకు వచ్చాడు. అయితే ఇంటికొచ్చిన తర్వాత ఇరుగుపొరుగు వారిని ఇబ్బంది పెడుతున్నాడు. తండ్రి ప్రవర్తన నచ్చని కుమారుడు.. ఆయనను హత్య చేశాడు. అనంతరం పోలీసుల ఎదుట ప్రశాంత్ లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు
చేపట్టారు.
ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఆచూకీ లభ్యం..?
భిక్కనూరు సిద్ధరామేశ్వరాలయం సవిూపంలో ఈ నెల 15వ తేదీన ఆత్మహత్యకు పాల్పడిన యువకుడి ఆచూకీ అభ్యమైంది. నిజామాబాద్ జిల్లా మెపాల్ మండలం బైరాపూర్‌కు చెందిన అర్జున్ (25) ఈ నెల 13 నుంచి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు మోపాల్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భిక్కనూరు పోలీసుల వద్ద ఉన్న మృతదేహం చిత్రం ఆధారంగా అర్జున్‌ను గుర్తించారు. ఈ విషయమై భిక్కనూరు సీఐ రాజశేఖర్‌ను వివరణ కోరగా మోపాల్ ఠాణాలో అదృశ్యమైన వ్యక్తే భిక్కనూరులో ఆత్మహత్య చేసుకున్నాడని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.