తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడి
నూజివీడు సీడ్స్ వారి క్షేత్ర ప్రదర్శన
చేర్యాల (జనంసాక్షి) అక్టోబర్ 17 : నూజివీడు సీడ్స్ వారి ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని ఆకునూరు గ్రామంలో పత్తి పంటలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా కంపెనీ ఉద్యోగులు ప్రవీణ్ రెడ్డి, రంజిత్ రెడ్డి లు మాట్లాడుతూ.. పంటకాలం తక్కువతో త్వరగా చేతికొచ్చి గులాబీ రంగు పురుగు వచ్చే ఆస్కారాన్ని తగ్గిస్తుందన్నారు. చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటుందని, ఈ సీడ్ అన్ని రకాల నేలలకు కాలాలకు అనుకూలంగా ఉంటుందన్నారు. పత్తి తీయడం సులువుగా రైతులకు కూలీల ఖర్చు తగ్గిస్తుందని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు కడారి నర్సయ్య, అనుముల సిద్దారెడ్డి, కూస మహేష్, శనిగరం రమేష్, అందె నాని బాబు, కడారి అయిలయ్య, కడారి నరేష్, కడారి కనకయ్య, అమరగొండ కొండ పోషయ్య తదితరులు పాల్గొన్నారు.