తక్షణమే ఎస్సి రిజర్వేషన్ ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్.

బి. మహేష్ మాదిగ
MSF జిల్లా కన్వీనర్

అచ్చంపేట ఆర్సి ,ఆగస్టు 5( జనం సాక్షి న్యూస్ ) ; స్థానిక పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ మాదిగలకు నమ్మక ద్రోహం చేస్తున్న బీజేపీ మొండి వైఖరికి మరియు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించకుండా 8 సంవత్సరాలుగా పైగా మాదిగలను మోసం చేస్తున్నందుకు బీజేపీ వైఖరిపై నిరసనగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి , మాదిగ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నాలుగవ రోజు రిలే నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. సందర్భంగా ఎం ఎస్ ఎఫ్ జిల్లా కన్వీనర్ బి .మహేష్ మాట్లాడుతూ
ఎస్సీ వర్గీకరణ బిల్లును తక్షణమే పార్లమెంట్లో ప్రవేశ పెట్టకుంటే, తెలంగాణలో బిజెపి పార్టీకి పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.సామాజిక న్యాయ డిమాండ్ అయినా వర్గీకరణకు మొదటి నుండి బిజెపి మద్దతు ఇస్తూ అనేక సందర్భాల్లో వేదికలపై మాట్లాడి, ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్ లో మాట్లాడి మాకు అధికారం వస్తే 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్న వర్గీకరణ ఊసే ఎత్తకుండా మాదిగలకు నమ్మకద్రోహం చేస్తున్న బీజేపీ రేపు తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని అన్నారు.బీజేపీకి మనస్సాక్షి ఉంటే వర్గీకరణ చేసి చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో MRPS తాలూకా ఇంచార్జి కొయ్యల బాలస్వామి MSF తాలూకా కన్వీనర్ చిట్టిగొరి పవన్ ,ఉదయ్ MRPS కన్వీనర్ ఆంజనేయులు నాయకులు , సోమలింగం, శ్రీధర్, శంకర్, పర్వతాలు, అరుణ్, బాలరాజు, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.