తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన జడ్పీటీసీ ఉమ్మన్న మనోహర్ రెడ్డి

నాగిరెడ్డిపేట్-13 అక్టోబర్  జనం సాక్షి మండలంలోని ఆత్మకూరు గ్రామంతో పాటు వివిధ గ్రామాల్లో తడిసిన వరి ధాన్యం కుప్పలను జెడ్పిటిసి ఉమ్మన్నగారి మనోహర్రెడ్డి గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా జడ్పిటిసి మాట్లాడుతూ రైతులు ఎవరు అధైర్యపడవద్దని త్వరలో రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని,అప్పటివరకు వరిధాన్యం కుప్పలను తడవకుండా జాగ్రత్త వహించి కాపాడుకోవాలి అన్నారు.ఆయన వెంట రైతులు ఉన్నారు.