తడి చెత్త పొడి చెత్త సేకరణపై అవగాహన

కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి
 హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 18(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణంలోని 1 వ, వార్డులో కౌన్సిలర్ కొంకటి నళినీ దేవి ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త సేకరణ పై మంగళవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రజలందరూ తడి చెత్తను పొడి చెత్తను వేరు వేరు చేసి పారిశుద్ధ సిబ్బందికి అందించాలని, వారు కోరారు.తడి చెత్తతో ఇంటి వద్దనే వర్మీ కంపోస్ట్, తయారీ విధానాన్ని ప్రయత్నం చేయాలని వార్డు ప్రజలకు తెలియజేశారు. అదేవిధంగా ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,డెంగ్యూ మలేరియా,రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వార్డు ప్రజలకు సూచించారు,
 ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మిర్యాల రమేష్, కో ఆప్షన్ సభ్యులు,ఐలేని శంకర్ రెడ్డి, యండి ఆయూబ్, డాక్టర్ రవి, సానిటరీ ఇన్స్పెక్టర్, నాగరాజు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్, రవికుమార్, ప్రశాంత్, ప్రభాకర్, ఆర్పి గడిపె సుమలత,వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు, పాల్గొన్నారు
Attachments area

తాజావార్తలు