తడి, పొడి చెత్తను వేరు చేయాలి…!

 వార్డు కౌన్సిలర్ బోజు రమాదేవి
హుస్నాబాద్ రూరల్ అక్టోబర్ 16(జనంసాక్షి)తడి, పొడి చెత్తను వేరు చేసి చెత్తబుట్టలో వేయాలని హుస్నాబాద్ పట్టణం రెండో వార్డు కౌన్సిలర్ బోజు రమాదేవి రవీందర్ అన్నారు. సోమవారం ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్త పై అవగాహన కల్పించి చెత్త సేకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు.చెత్తను చెత్త బుట్టలో వేస్తే దాన్ని పారిశుద్ధ కార్మికులు డంపింగ్‌ చేయడానికి సులువుగా ఉంటుందన్నారు.ప్రతి ఇంటికీ చెత్త సేకరణ కోసం రెండు చెత్త బుట్టలను తడి, పొడి చెత్తను వేరు చేసి ఉంచినట్టయితే దాన్ని తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలను పాటించి స్వచ్ఛత కోసం సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మున్సిపల్ ఎస్సై నాగరాజు, ఎన్విరాన్మెంట్ రవి, వార్డ్ ఆఫీసర్ జే,శంకర్ ,ఆర్ పి శ్రీలత, మున్సిపల్ జవాన్ గడిపేసారయ్య,మంద ప్రభాకర్, అఖిల్ రెండో వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు