తనకు మద్ధతుగా నిలిచినవారికి ధన్యవాదాలు తెలిపిన మలాలా
లండన్: తాలిబన్ల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి ప్రస్తుతం లండన్‌లో కోలుకొంటున్న పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసుఫ్‌జాయ్(15) ప్రపంచవ్యాప్తంగా తనకు మద్ధతుగా నిలిచినవారందరికీ తెలిపింది. ఈమేరకు ఆమె తండ్రి జియాయుద్దీన్ యుసుఫ్‌జాయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. మలాలా కోలుకోవాలంటూ ఆకాంక్షించి, కష్టకాలంలో అండగా నిలిచి మద్ధతు ప్రకటించి ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు చెప్పినట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా యువతీయువకులు, పురుషులు, మహిళలు, పిల్లలు ఇలా ఎంతో మంది ఆమె క్షేమంగా ఉండాలని కోరుకోవడం పట్ల చాలా ఆనందంగా ఉందని, గ్లోబల్ ఎడ్యుకేషన్‌కు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక రాయబారిగా వ్యవహరిస్తున్న బ్రిటన్ మాజీ ప్రధాని బ్రౌన్ మలాలాడే గా ప్రకటించడం పట్ల జియాయుద్దీన్ హర్షం వ్యక్తం చేశారు. ఆమె క్రమంగా కోలుకొంటున్నట్లు బర్మింగ్‌హోమ్‌లోని క్వీన్ ఎలిజబెత్ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి,