*తన కవిత్వంతో తెలంగాణ స్వరాష్ట్రా ఆకాంక్షను రగిలించిన మహా ప్రజాకవి కాళోజీ నారాయణ రావు*
ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 9 :
తెలంగాణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ప్రజల మనిషి, తన కవిత్వంతో తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను రగిలించిన ప్రజాకవి కాళోజీ నారాయణ రావుని బెటాలియన్ కమాండెంట్ బి. రామ్ ప్రకాష్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బీచుపల్లి పదవ బెటాలియంలో శ్రీ కాళోజీ నారాయణ రావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పదవ బెటాలియన్ కమాండెంట్ రామ్ ప్రకాష్, బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జి. మనీ లు శ్రీ కాలోజీ నారాయణరావు చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ తొలిపొద్దు కాళోజీ అని అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణర రావు అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కవులలో కాళోజీ ప్రముఖులు తన యొక్క కవితలతో తెలంగాణ ప్రజలను ప్రభావితం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడానికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎంతో కృషి చేశాడని అన్నారు. ఎలాంటి సందర్భంలోనూ పదవులకుగాని, ఎలాంటి వ్యామోహాలకు గాని లొంగనితత్వం కాళోజి సొంతం మన్నారు. ప్రజల గొడవను తన గొడవగా భావించి పోరాడిన మహాశాలి అందుకనే తెలంగాణ ప్రభుత్వం ఆమహనీయుని పుట్టిన రోజును తెలంగాణ రాష్ట్ర మాండలిక దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు రాజారావు, రమేష్ బాబు, శ్రీధర్, గోపాల్ తదితర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.