తపస్సు ఆధ్వర్యంలో స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలు

మక్తల్ ఆగస్ట్ 2 (జనంసాక్షి)
దేశానికి స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మక్తల్ మండలంలోని వివిధ పాఠశాలల్లో భారత స్వాతంత్ర్య  అమృతోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.మండలంలోని వివిధ పాఠశాలలో వ్యాసరచన చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్ష కార్యదర్శులుభీమ్ రెడ్డి, రవీందర్
మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగాల పునాదులపై స్వేచ్ఛ భారత నిర్మాణం జరిగింది అని ఆ త్యాగమూర్తుల ఆదర్శాలను ముందు తరాలకు అందించాలని కోరారు. బాల్యం నుండే దేశభక్తి భావజాలాలను విద్యార్థుల్లో నింపడం వల్ల దేశం కోసం పరితపించే యువత తయారవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలోజిల్లా ఉపాధ్యక్షులు నాగార్జున, వెంకట్రాములు, ప్రహ్లాద్, ఆంజనేయులు, రాము గౌడ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు