తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు
న్యూఢిల్లీ,సెప్టెంబర్ 7(జనంసాక్షి):తప్పుడు ప్రకటనల వల్లే కాశ్మీర్‌లో అల్లర్లు చేలరేగుతున్నాయని అఖలపక్ష నేతలు ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అల్లర్లను నియంత్రించడంలో జమ్మూకశ్మీర్ ప్రభుత్వం విఫలమైందని అఖిలపక్ష బృందం స్పష్టం చేసింది. కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కశ్మీర్ల అల్లర్లపై అఖిలపక్ష సమావేశంలో కశ్మీర్ అల్లర్లపై చర్చించారు. తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఆ రాష్ట్ర నేతలు ఇవ్వడం కూడా అల్లర్లకు కారణమయ్యాయని పేర్కొంది. తాజగా అక్కడ జరిగిన అల్లర్లను కూడా విశ్లేషించారు. జమ్మూకశ్మీర్‌ను సందర్శించిన అఖిలపక్ష బృందం పర్యటన వివరాలను రాజ్‌నాథ్ ప్రధాని మోదీకి వివరించిన విషయం విదితమే. ఇక వేర్పాటువాద నేతలు అఖిలబృందాన్ని కలుసుకోవటానికి నిరాకరించారు. మరోవైపు.. జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. వేర్పాటువాదుల పట్ల కఠినంగా వ్యవహరించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిపై రాజ్‌నాథ్‌తో మత పెద్దలు నిన్న సమావేశమై చర్చించారు. కశ్మీర్‌లో పరిస్థితిని రాజ్‌నాథ్ చక్కదిద్దుతారని నమ్మకముందన్నారు. పాకిస్థాన్ జిందాబాద్ అని నినదిస్తున్న హురియత్ నేతలతో మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించిన విషయం తెలిసిందే.