తప్పుల తడకగా పరీక్షా పత్రం
షాబాద్: పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షా పత్రం తప్పుల తడకగా రూపొందింది. శుక్రవారం జరగాల్సిన సాంఘిక శాస్త్రం మొదటి పేపరు పరీక్షాపత్రంలో రెండో పేపరులో ఇవ్వాల్సిన భూగోళ, అర్థశాస్త్రాలలోని ప్రశ్నలు ముద్రించారు. మ్యాపు కూడా రెండో పేపరులో ఇవ్వాల్సి ఉండగా దీనిని మొదటి పేపరులో ఇచ్చారు. దీంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.