తమ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజాప్రతినిధికి ఈ దృశ్యం
అ”రణ్యం”
డోర్నకల్ సెప్టెంబర్ 29 జనం సాక్షి
తమ వార్డు అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఉపన్యాసాలు ఇచ్చే ప్రజాప్రతినిధికి ఈ దృశ్యం ఓ కనువింపు.ఊరు నడిబొడ్డున పాత పోలీస్ స్టేషన్ సమీపాన జనావాసాల మధ్య అరణ్యాన్ని తలపించే రీతిలో ఖాళీ స్థలంలో దట్టంగా పెరిగిన మొక్కలు విష పురుగులకు,మానవుల మూత్ర విసర్జనకు నెలవుగా మారింది.దోమలు,క్రిమి కీటకాలకు చుట్టుపక్కల జనావాసులు అనారోగ్యానికి గురవుతున్నారు.పట్టణ ప్రగతిలో పరిసరాల పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన స్థానిక కౌన్సిలర్,అధికారులు ప్రధాన రహదారి పక్కన గుర్తించకపోవడం గమనార్హం.ఇప్పటికైనా స్పందించి మొక్కలు తొలగించి పరిసరాల పరిశుభ్రత,ప్రజా ఆరోగ్యాలకు పాట్పడాలని స్థానిక పౌరులు కోరుతున్నారు.కౌన్సిలర్ మౌనిక యశోదర్ జైన్ మాట్లాడుతూ.. చెట్లు తొలగించలని సంబంధిత ప్లాట్ యజమానిని ఆదేశించినట్లు తెలిపారు.లేనియెడల మున్సిపల్ నిబంధన మేరకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.