తల్లిపాలే  బిడ్డకు శ్రీరామ రక్ష 

గరిడేపల్లి, ఆగస్టు 2 (జనం సాక్షి):బిడ్డకు తల్లి పాలు త్రాగించడం వలన అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.తల్లిపాల వారోత్సవాలలో భాగంగా మంగళవారం మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రం లో కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామంలో తల్లులతో ప్రదర్శన చేసి తల్లి పాల విశిష్టత గురించి ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బిడ్డ పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగించడం వలన రోగానిరోధక  శక్తి పెరగడమే కాక పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ప్రతి తల్లి బిడ్డకు రెండు సంవత్సరాల వయసు వచ్చే వరకు తప్పకుండ తల్లి త్రాగించాలని ఆమె తల్లులను కోరారు.కొంతమంది తల్లులు ప్రాశ్చాత సంస్కృతికి లోనై బిడ్డలకు తల్లి పాలు ఇవ్వడం లో నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన పిల్లలకు భవిష్యత్తు లో నష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ పోకల వెంకమ్మ, అమరావరపు సత్యవతి, నసీమ , లక్ష్మి, త్రివేణి, మనీషా, పీరాంబి , ఇందు, మాదారబీ, గోవిందమ్మ, గ్రామ పెద్దలు గర్భిణీ లు బాలింతలు పాల్గొన్నారు.