తల్లిపాలే బిడ్డకు శ్రీరామరక్ష*

నేరేడుచర్ల (జనంసాక్షి): తల్లి పాలే బిడ్డకు శ్రీరామ రక్ష లాంటిదని అంగన్వాడీ సూపర్వైజర్ నాగమణి అన్నారు. బుదవారం పురపాలిక పరిధిలోని 06 వ వార్డులో అంగన్ వాడీ కేంద్రం నందు  తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్ వైజర్ సిహెచ్ .నాగమణి మాట్లాడుతూ తల్లులందరికి తల్లి పాల ఆవశ్యకత పై అవగాన కల్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,తల్లులు పుట్టిన పిల్లలకు గంటలోపు ముర్రు పాలు పట్టించాలి,పిల్లలకు వెలకట్టలేని మొదటి టీకా తల్లి ముర్రు పాలే అని వారన్నారు,అంటే కాకుండా  మొదటి ఆరు నెలలు తల్లిపాలు పట్టించటం వలన పిల్లలలో వ్యాధి నిరోధక శక్తి పెరగటంతో పాటు ఎన్నో అనారోగ్య సమస్యల నుండి తల్లి పాలు ఎన్నో విధాలుగా రక్షణ కలిపిస్తాయన్నారు,అదేవిధముగా మొదటి ఆరు నెలల తరువాత తల్లిపాలతో పాటే అనుబంధ ఆహారం అందించాలని మరియు అంగన్ వాడీ కేంద్రంలో అందిస్తున్న బాలామృతం కూడా అందించాలన్నారు ,కనీసం తల్లి రొండు సంవత్సరాల వరకైనా తల్లిపాలు ఇవ్వాలని వారన్నారు. కార్యక్రమంలో 06 వార్డు కౌన్సిలర్ తాళ్ళూరి సాయి పాల్గొని  అంగన్ వాడీ కేంద్రానికి ఫ్యాన్ బహూకరించారు.ఈ కార్యక్రమంలో  టీచర్ సరితా,ఆయా పద్మ,ఏ ఎన్ మ్ సునీత, ఆశా అవర్కర్, యశోద, తదితరులు పాల్గొన్నారు.