తల్లి తండ్రుల ను వృద్ధాశ్రమాల్లో చేర్పించడం సరికాదు.
వయోవృద్ధులకు సముచిత గౌరవం ఇస్తూ ఆదరించాలి.
జిల్లా పరిషత్ చైర్మన్ పి.పద్మావతి.
వయోవృద్ధులు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
కలెక్టర్ పి.ఉదయ్ కుమార్.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,అక్టోబర్ 1(జనంసాక్షి):
వయోవృద్ధులకు సముచిత గౌరవం ఇస్తూ ఆదరించాల్సిన బాధ్యత వారి సంతానం పై ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ పి.పద్మావతి బంగారయ్య అన్నారు.శనివారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవాన్ని జిల్లా మహిళా భివృద్ది మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లొ నిర్వహించగా జడ్పి చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెద్దలు ఇంటికి ఒక దీపంలా ఉంటారు తప్ప వారు ఏ మాత్రం ఇంటికి భారం కాదని పేర్కొన్నారు.ప్రతి తల్లి దండ్రులు తమ పిల్లలు ప్రయోజకులు కావాలని కోరుతూ తాము కష్టాలు పడుతూ పిల్లలకు ఉన్నత చదువులు చదివిస్తారన్నా రు.తీరా ప్రయోజకులు అయ్యాక తమ తల్లిదండ్రులను నిరాదరణ చేసి చివరకు వృద్ధాశ్రమాల్లో చేర్పించడం సరైనది కాదన్నారు.రేపు వాళ్ల పిల్లలు సైతము అదేపని చేస్తారని అందుకే పిల్లలకు చదువుతో పాటు మంచి సంస్కారం నేర్పించాలని సూచించారు.రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్యంలో అనాధాలు కాకుండా ఉండేందుకు 2016 ఆసరా పెన్షన్ ఇచ్చి ఆదుకుంటున్నారని కొనియాడారు. ఇప్పుడు 57 సంవత్సరాల వయస్సు వారికీ ఆసరా పెన్షన్ కు అర్హులుగా ఉత్తర్వులు జారీ చేసి అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం వయో వృద్ధులకు శాలువలతో సన్మానం చేశారు.
వయోవృద్ధులు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
జిల్లా కలెక్టర్ బి.ఉదయ్ కుమార్.:
అంతకు ముందు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కలెక్టరేట్ నుండి వయో వృద్ధుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరైనా వయోవృద్ధులను నిరాదరణకు గురిచేస్తే ఆర్డీఓ కు అప్పీల్ చేసుకుంటే వారికి వయోవృద్జుల చట్టం ప్రకారం తగు న్యాయం ఇప్పించడం జరుగుతుందన్నారు. అక్కడ వారికి న్యాయం జరగలేదని అనిపిస్తే కలెక్టర్ కు అప్పీల్ చేసుకోవచ్చని తెలియజేసారు.వయోవృద్ధులు చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అదనపు కలెక్టర్:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదనవు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి వృద్ధాప్యం తప్పదని అన్నారు.పిల్లలకు చదువుతో పాటు తల్లిదండ్రులను గౌరవించే సంస్కారం నేర్పించాలన్నారు.ఎవరైనా తమ తల్లిదండ్రులను వృద్ధాప్యంలో అనాధాలుగా వదిలేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవ డం జరుగుతుందని హెచ్చరించారు.ప్రతి ఒక్కరు తమ తల్లిదండ్రులను వారి వృద్ధాప్యంలో తోడుగా ఉండి మానవ విలువలను కాపాడాలాని సూచించారు.
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి:
జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి మాట్లాడుతూ తమ శాఖ ద్వారా వయోవృద్ధులకు అవసరమైన సహకారం అందిస్తుందన్నారు.వారి సమస్యలకు హెల్ప్ లైన్ నెంబర్ 14567 ఏర్పాటు చేయడం జరిగిందని దీనిని వయోవృద్ధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.న్యాయ పరమైన సమస్యలు ఉంటే ఇంటికి వచ్చి తెలుసుకొని ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందన్నారు.నిరాదరణకు గురైన వారు ఇప్పటి వరకు 21 ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు.6 గురి పై కేసులు సైతం చేసినట్లు తెలిపారు. ఎక్కడైనా అనాధలు ఉంటే వయోవృద్ధులు ఇబ్బందులు పడుతుంటే మా హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని సూచించారు. జిల్లాలో 4 వృద్ధాశ్రమాలు ఉన్నాయని వాటిలో 109 మంది జఅశ్రయం పొందుతున్నట్లు తెలిపారు.
వయోవృద్ధుల ఫోరమ్ అధ్యక్షులు:
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వయోవృద్ధుల ఫోరమ్ అధ్యక్షులు చెన్నయ్య మాట్లాడుతూ చట్టం గురించి అధికారులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు.అవగాహన లేక సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. ఈ రోజు కార్యక్రమానికి పోలీస్ శాఖ నుండి అధికారులు, ఆర్డీఓ లు ఏ ఒక్కరూ హాజరు కాకపోవడం పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పి డి.డి.ఆర్.డి.ఏ నర్సింగ్ రావు, వివేకానంద స్వచ్చంద సంస్థ నుండి రామకృష్ణ, విశ్రాంత ఉద్యోగుల సంఘం నుండి బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, నర్సయ్య, లక్ష్మా రెడ్డి, జి. రామచంద్రయ్య, కృష్ణయ్య, శ్రీధర్, సుధాకర్, సి.డబ్ల్యూ.సి చైర్మన్ లక్ష్మణ్ రావు, వయో వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area