తల్లి పాలపై అవగాహన కార్యక్రమం
హుస్నాబాద్: మండలంలోని అంతకపైట గ్రామంలో ఈరోజు అంగన్ వాడి కేంద్రం అధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా తల్లిపాల ప్రాముఖ్యతను గర్భిని, బాలింత మహిళలకు వివరించారు. శిశువులు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు తప్పనిసరని వారు తెలియజేశారు. ఈ కార్యర్రమంలో అంగన్వాడి కార్యకర్తలు శారద, అమరాతి, సమ్మమ్మ పాల్గొన్నారు.