తహసీల్దారుపై ఆర్డీవో ఆగ్రహం

కొమరోలు , జూలై 13 : కొమరోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు గత కొన్ని దశాబ్ధాల క్రితం దాతలు స్థలాన్ని విరాళంగా ఇచ్చి ఉండగా ఆ స్థలంలో కొంతభాగం అన్యాక్రాంతమైందని, ఈ విషయంలో ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో తహసీల్దారుకు అర్జీ ఇచ్చినప్పటికీ పట్టించుకోలేదని మాజీ మండల ఉపాధ్యక్షులు ఎన్‌ సుబ్బరాయుడు సమావేశంలో ఆందోళన వ్యక్తం చేయగా వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఆర్దీఓను వివరణ కోరగా దీంతో ఆర్డీవో రాఘవరావు పక్కనే ఉన్న తహసీల్దారు చంద్రశేఖర్‌రాజుపై డోంటాక్‌ రబ్బీస్‌ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. 15 రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలని లేకపోతే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ వైద్యశాలకు దాత ఇచ్చిన స్థలాల్లో కొంతభాగం అన్యాక్రాంతమైందని, ఈ విషయంపై పూర్తి దర్యాప్తుతో సర్వే నిర్వహించి దానిపై పూర్తి నివేదికను అందచేయాలని మార్కాపురం ఆర్డీవో రాఘవరావు తహసీల్దారును ఆదేశించారు.