తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ దాడి
వరంగల్: వరంగల్ జిల్లా బచ్చన్నపేట తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ ఈరోజు దాడులు నిర్వహించింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం రూ. 8 వేలు లంచం తీసుకుంటూ ఉప తహసీల్దారు రాజేందర్ ఏసీబీకి చిక్కారు. అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు.