తహసీల్దారు కు వినతిపత్రం అందజేసిన విఆర్ఓ లు
మల్దకల్ జులై 4 (జనంసాక్షి) తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం జోగులంబ గద్వాల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం విఆర్ఓ లకు స్పష్టమైన ” విధులు బాధ్యత” (జాబ్ చార్ట్) ఇవ్వాలని సోమవారం మల్దకల్ మండల తహసీల్దారు సరిత రాణి కు విఆర్ఓ లు వివిధ డిమాండ్ లతో వినతిపత్రం అందజేసినారు… ఈ సందర్భంగా మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు బుడ్డన్న మాట్లాడుతూ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోని రీ లోకేట్ చేయాలి, అకాల మరణం చెందిన వీఆర్వో కుటుంబాలలో కారుణ్య నియామకాలు చేపట్టాలి,అర్హత కలిగిన విఆర్ఓ లకు పదోన్నతులు ఇవ్వాలి,సర్వీసు రెగ్యులరైజ్ కానీ వీఆర్వోలకు సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలి, 6 12 18 సంవత్సరాల ఇంక్రిమెంట్లు ఇవ్వాలి,సర్వే టూ ఆర్డర్లో ఇతర జిల్లాలో ఉండిపోయిన వీఆర్వో అ అభీష్టం మేరకు వారి సొంత జిల్లాలకు బదిలీలు చేయాలి ,సాధారణ బదిలీలు స్పాజ్ మెడికల్ ఒంటరి మహిళలు మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ పరస్పర బదిలీ చేయాలి రెవిన్యూ శాఖలో అన్ని స్థాయిలో క్యాడర్ స్ట్రెంత్ పెంచాలి,వివిధ కారణాల వలన సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్స్ ఇవ్వాలి.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు సురేష్, సందీప్ లోకేష్ కవిత తిరుమలేష్ గౌడ్ తదితరులు ఉన్నారు