*తహసీల్దార్ కార్యాలయం దిగ్బంధనం.*

వెంకటాపురం అక్టోబర్10 జనంసాక్షి:
తెలంగాణ రాష్ట్ర వీఆర్ఏ జేఏసీ నిర్ణయం మేరకు మండల కేంద్రంలో వెంకటాపురం నూగూరు మండలంలో గ్రామ రెవెన్యూ సహాయకులుకు  ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి  హామీలు పేస్కేల్ జీవోను మరియు అర్హులైనటువంటి వీఆర్ఏలకు ప్రమోషన్స్ మరియు 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి వారి వారసులకు ఉద్యోగాలు ఇస్తానని  అసెంబ్లీ సాక్షిగా హామీ ఇవ్వడం జరిగినది. ఇట్టి హామీని నెరవేర్చి జీవోను విడుదల చేసేంతవరకు ఈ సమ్మెను కొనసాగిస్తున్నాం.
 ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలో స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామ రెవెన్యూ సహాయకులు నిరవధిక సమ్మె దీక్షలు 78వరోజుకు చేరింది.
 రాష్ట్ర విఆర్ఎ జేఏసీ మరియు జిల్లా విఆర్ఎ జేఏసీ నిర్ణయం మేరకు  రాష్ట్రంలోఉన్న అన్ని మండలాల తహశీల్దార్లు కార్యాలయలకు తాళాలు వేసి తహశీల్దార్ లను ఆఫీస్ సిబ్బందిని దిగ్బంధనం చేసి  నిరసనలు తెలియపరచడైనది. వెంకటాపురం మండలం తహశీల్దార్  మరియు వారి సిబ్బందిని లోపలికి ప్రవేశించకుండా ఆఫీస్ గేటుకు తాళాలు వేసి దిగ్బంధనం చేయనైనది.
వీఆర్ఏల 78వరోజు   నిరసనలు తెలియపరచడమైనది. ఈ కార్యక్రమంలో వెంకటాపురం నూగూరుమండల వీఆర్ఏలు మండల అధ్యక్షులు కంటెం బలరాములు ,ఉపాధ్యక్షులు రేగ రాజేష్ ,కార్యదర్శి ఉండం శిరీష ,రజిత ,అరుణ ,సమ్మక్క, సమ్మయ్య  ,రామస్వామి, ముసలయ్య,తిరుపతమ్మ ,లక్ష్మయ్య ,కళ్యాణి , బాబ్జి,పాల్గొనడం జరిగినది.