తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు సరికాదని తాండూరు మండల అధ్యక్షులు సూరం దామోదర్ రెడ్డి ఖండించారు.

మంచిర్యాల / తాండూర్, సెప్టెంబర్ 23(జనంసాక్షి):- తాండూరు కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు సరికాదని తాండూరు మండల అధ్యక్షులు సూరం దామోదర్ రెడ్డి ఖండించారు. ప్రజల బెల్లంపల్లి నియోజకవర్గo తాండూరు మండలం సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకు వెళ్ళకుండా తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులను పోలీసుల చేత అరెస్టులు చేసి మాదారం ,తాండూరు పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది . తాండూరు మండల కాంగ్రెస్ యూత్ నాయకులు పుట్ట శ్రీనివాస్ మాదారం వార్డు సభ్యులు కృష్ణ పెళ్లి లక్ష్మణ్ మాదారం టౌన్ ప్రెసిడెంట్ పోగు రవి ఉప్పట్ల దుర్గా చరణ్ లను అరెస్టు చేసిన కాంగ్రెస్ నాయకులను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు.