తాగుడు వద్దన్నందుకు కత్తితో భార్య గొంతు కోసిన భర్త అరెస్ట్

వేములవాడ జులై 26 (జనంసాక్షి)
వేములవాడ పట్టణం లోని భవాని నగర్ లో ఓ అద్దె ఇంటిలో ఉంటున్న సయ్యద్ ఖలీల్ అను నతడు గత కొద్దీ కాలంగా తాగుడు కి బానిస కాగా భార్య ఫర్వీన్ బేగం మద్యం తాగుడుమానివేయాలని తన భర్త తో తరచు అనడంతో భార్య పై కక్ష పెంచుకొని ఎలాగైనా చంపాలని అనుకోని గత 6 రోజుల క్రితం ఇంట్లో ఎవరు లేని సమయం లో కత్తి తో భార్య గొంతు కోసి అనంతరం ఇంటి నుండి పరార్ అయ్యాడని తన కొడుకు సయ్యద్ షోయబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మంగళవారం రోజున నిందితున్ని కత్తితో సహా అదుపులోకి తీసుకొని రిమాండ్ కి తరలించామని అని పట్టణ సిఐ ఓ. వెంకటేష్ తెలిపారు.