తాత్కాలిక సర్పంచ్ గా చల్ల రమేష్ బాధ్యతలు స్వీకరణ

మహాదేవపూర్. అక్టోబర్11 ( జనంసాక్షి )
మహదేవపూర్ మండలంలోని సురారం గ్రాంపంచాయితీ తాత్కాలిక సర్పంచ్ గా చల్ల రమేష్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఉత్తర్వులు జారీచేశారు. సోమవారంనాడు గ్రామ కార్యాలయంలో ఉప సర్పంచ్ రమేష్ కు తాత్కాలిక సర్పంచ్ గా ఉత్తర్వుల పత్రాలనుఅందజేస్తున్నట్లు మండల పంచాయితీ అధికారి ప్రసాద్ తెలిపారు.అనంతరం చల్ల రమేష్ తాత్కాలిక సర్పంచ్ గా భాద్యతలు చేపట్టారు.ఈ కార్యాక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రాణీ బాయి హాజరైనారు.ఈ సందర్భంగాతాత్కాలిక సర్పంచ్  రమేష్ మాట్లాడుతూ  సూరారం గ్రామ అభివృద్ధికి తోడ్పతనని ప్రజల సహకారంతో తాను కృషి చేస్తానని అన్నారు.సురారం గ్రామ పంచాయితీ నిధుల దుర్వినియోగం పై వచ్చిన ఆరోపణలపై జిల్లాపంచాయితీ అధికారి విచారణా నివేదికపై జిల్లా కలెక్టర్ సురారం సర్పంచ్ నాగుల లక్ష్మారెడ్డి రెడ్డి ని  సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమంలో గ్రామ కార్యదర్శి అంజలి, గ్రామ పంచాయితీ పాలక మండలి సభ్యులు తలారి రవిసాగర్,లెల్ల రజిత, మేకల జక్కులు.మల్లారపు సారక్క. ముల్కల సాంబశివా రెడ్డి. చల్ల మహేష్.బల్నే మానస. తులసి మాధవి. ఆయిల్ల సంధ్య. తదితరులు పాల్గోన్నారు.అనంతరం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు