*తాసిల్దార్ కార్యాలయం ముట్టడి*
ఉండవల్లి, అక్టోబర్ 10 (జనం సాక్షి):
డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు 78 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 78 రోజులుగా ఇంటిని వదిలి, కుటుంబ సభ్యులను వదిలి నిరాహార దీక్షలో కూర్చున్న ప్రభుత్వం స్పందించడం లేదని వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తూ ఉండవెల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి తాసిల్దారు వీరభద్రప్పకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు, కో కన్వీనర్ షేక్షావలి, నారాయణ, కృష్ణ, నాగవేణి, జహాదా, గజేంద్ర గౌడ్, యాదగిరి జమీలాభి, బాబు తదితరులు పాల్గొన్నారు.
Attachments area