తాహసిల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి

మల్దకల్ ఆగస్టు 6 (జనంసాక్షి)

మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ 88వ జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి తహసిల్దార్ సరిత రాణి పూలమాల వేసి ఘనంగా శనివారం నివాళ్ళర్పించారు. తహసిల్దార్ సరిత రాణి మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర సాదనే ఊపిరిగా సాగిన మీ జీవితం యావత్ తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకం.తెలంగాణ స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం మీరు చేసిన పోరాటం చిరస్మరణీయమని ఆమె అన్నారు. తెలంగాణ కల సాకారం చేస్తున్న ఆయన అడుగుజాడల్లో పయనిస్తూన్నామని ఆమె అన్నారు.నాలుగు కోట్ల ప్రజలలో ఉద్యమ చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ మదన్ మోహన్ గౌడ్,ఆర్ఐ రామకృష్ణ, సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ కిరణ్, జూనియర్ అసిస్టెంట్ మధు,సుబ్రహ్మణ్యం గౌడ్, శేఖర్ ,సాయి ,అనిల్ తదితరులు పాల్గొన్నారు.