తిరుమలలోని శ్రీవారి భక్తుల తాకిడి
తిరుమల : తిరుమలలోని శ్రీవారి భక్తుల తాకిడి పెరుగుతుంది. నిన్న శ్రీవారిని 34,562 మంది దర్శించుకున్నారు. 14,689 మంది తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్ కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.94 కోట్లు వచ్చిందని వివరించారు.
శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. శ్రీవారి భక్తులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆఫ్ లైన్ సర్వదర్శనం టోకెన్లపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15 నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్లో జారీ చేయనున్నారు. కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఆఫ్‌లైన్ టికెట్ల జారీని ఎల్లుండి నుంచి పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.
16వ తేదీ దర్శనం కోసం 15న ఉదయం 9 గంటలకు టీటీడీ టోకెన్లు జారీ చేస్తుంది. రేపటి నుంచి తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవింద రాజ స్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు. నిత్యం 15 వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చెయ్యాలని టీటీడీ నిర్ణయించింది.