తిరుమల కొండపై కూల్చేసిన అన్నమయ్య గృహాన్ని వెంటనే నిర్మించాలి.

విజయ శంకర స్వామి
జాతీయ అధ్యక్షులు అన్నమయ్య గృహ సాధన సమితి.
జనం సాక్షి ఉట్నూర్.
తిరుమల కొండపై సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని ఆంజనేయస్వామి విగ్రహాన్ని అన్నమయ్య విగ్రహ ప్రాంగణాన్నీ పున:ప్రతిష్ఠ చేయాలని కోరుతూ జైభారత్, అన్నమయ్య గృహ సాధన సమితి సంయుక్త అధ్వర్యంలో
అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతులు విజయ శంకర స్వామి నేతృత్వంలో అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్ర జరుగుతోంది.గతనెల రోజుల నుండి రెండు రాష్ట్రాల్లో జైభారత్ అధ్వర్యంలో జరుగుతున్న అన్నమయ్య గృహ సాధన చైతన్య రథయాత్రలో భాగంగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని సాయి రామ్ ఆలయాన్ని చేరుకుంది.
జైభారత్ ఎస్టీ పోరాట వేదిక కో కన్వీనర్ దీపక్ పెందూర్ అధ్వర్యంలో ఉట్నూర్ పట్టణంలోని జైభారత్ కార్యకర్తలు అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు విజయ శంకర స్వామికి పుష్పాంజలి, స్థానిక మెయిన్ రోడ్ నుంచి ఆలయం వరకు భారీ ర్యాలీ తో ఘన స్వాగతం పలికారు.సాయి రామ్ ఆలయ అర్చకులు అన్నమయ్య గృహ సాధన సమితి జై భారత్ సేకరించిన 11 లక్షల యాబై వేల సంతకాలకు పూజలు నిర్వహించి విజయ శంకర స్వామిని శాలువాతో సన్మానించారు.జరిగిన సమావేశంలో అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ అధ్యక్షులు విజయ శంకర్ స్వామి మాట్లాడుతూ 2003లో తిరుమలకొండపై కూల్చేసిన సమతా ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య గృహాన్ని ఆంజనేయ విగ్రహాన్ని యథాస్థానంలో టీటీడీ బోర్డు వెంటనే నిర్మించాలనీ డిమాండ్ చేశారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నమయ్య గృహాన్ని ఆంజనేయ విగ్రహాన్ని తిరుమల కొండపై ప్రతిష్టించాలని అన్నమయ్య గృహ సాధన సమితి జై భారత్ చేపట్టిన పదకొండు లక్షల యాభై వేల సంతకాల సేకరణలో జైభారత్ కార్యకర్తల కృషి అపూర్వం అని తెలిపారు.ఆనంతరం అన్నమయ్య గృహ సాధన సమితి జాతీయ ప్రధాన కార్యదర్శి ఖదిజ్ఞాసి దున్న లక్స్మేశ్వర్ మాట్లాడుతూ
తెలుగు భాషకు ప్రాణం పోసిన తొలి వాగ్గేయకారులు తాళ్ళపాక అన్నమాచార్యులు అని అన్నారు.14 వ శతాబ్దంలోనే సామాజిక అసమానతలపైన వివక్ష పైన సంస్కరణ కోసం సంకీర్తన రూపంలో సామాజిక మార్పు కి కృషి చేసిన సమత ఆధ్యాత్మిక మూర్తి అన్నమయ్య అని అన్నారు.అన్నమాచార్యుల గృహాన్ని, ఆయన పూజించిన దేవతా మూర్తులను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని భావితరాలకు అయిన స్ఫూర్తిని అందించవలసిన టీటీడీ వాళ్ళే అయిన స్మృతులు అన్ని తొలగించడం దురదృష్టకరం అని అన్నారు.
తిరుమల కొండ పైన అన్నమయ గృహ నిర్మాణ జరిగే వరకు ఉద్యమాన్ని అపేది లేదని జై భారత్ అన్నమయ గృహ సాధన చైతన్య రథ యాత్ర ద్వారా రెండు తెలుగు రాష్టాల ప్రజలలో చైతన్యం కలిగించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
జైభారత్ ఎస్టీ పోరాట వేదిక రాష్ట్ర కో కన్వీనర్ దీపక్ పెందూ ర్ మాట్లాడుతూ తిరుమల కొండపై వెంటనే అన్నమయ్య విగ్రహాన్ని గృహాన్ని దేవతా మూర్తుల విగ్రహాలను నెలకొల్పేందుకు టీటీడీ తగు చర్యలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జైభారత్ జాతీయ కార్యదర్శి లోక్ నాథ్ సత్యనారాయణ గోల జైభారత్ జాతీయ సమితి సభ్యులు సలీం జైభారత్ రాష్ట్ర నాయకులు రాఘవదాస్ జిల్లా నాయకులు అత్రం శేషు నారాయణ్ గంగారాం మహత్మే చంద్రక్రంత్ కే.సతీష్ రహీల్ ఖాన్ ఆలయ కమిటీ చైర్మన్ రవీందర్ హరి ప్రసాద్ గోపి తదితరులు ఉన్నారు.