తీగజాతి కూరగాయలు అధిక లాభాలు
రామారెడ్డి జులై 16 జనంసాక్షీ :
తీగజాతి కూరగాయల పందిరిని శనివారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవ్ రావు, జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడి దయానంద్, సీఈఓ రాజారాం పరిశీలించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వీరయ్య అనే రైతు, బీర, సొర, కాకరకాయ తీగజాతి కూర గాయల పంటలను సాగు చేపట్టాడం అభినం దనీయమని అన్నారు. ఉద్యానవన శాఖ ద్వారా రాయితీపొందిన రైతు బిందు సేద్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పారు. తీగజాతి కూరగాయలు సాగు చేయడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని పేర్కొన్నారు.
Attachments area